- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య విరాళాల చోరీపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసుపై ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలిసారి స్పందించింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఓ మీడియా సమావేశంలో విరాళాల చోరీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసుపై ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తొలిసారి స్పందించింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఓ మీడియా సమావేశంలో విరాళాల చోరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడి వారాళాలు దొంగలించడం తమను తీవ్రంగా బాధిస్తోందని అన్నారు. తరతరాలుగా భక్తుల త్యాగాలు, అంకితభావం కారణంగా అయోధ్యలో భారీ ఆలయం రూపుదిద్దుకుందని చెప్పారు. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
దీనిని ప్రత్యేక అంశంగా పరిగణించి, ఆలయ నిర్వహణలో లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాలని ట్రస్ట్ సభ్యులకు సూచించారు. కేసులో విచారణ దశలో ఉన్నందున నిందితులకు శిక్ష పడేవరకు సంయమనం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను అవకాశంగా తీసుకుని కొంతమంది హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే విరాళాల చోరీపై ఇప్పటికే యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






