హైదరాబాద్ రెయిన్ అప్డేట్.. రానున్న రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

by Naga Rani Yarlagadda |

రానున్న రెండు గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

హైదరాబాద్ రెయిన్ అప్డేట్.. రానున్న రెండు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. భారీ, మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. కొత్తపంటలు వేసే సమయంలో వర్షాలు పడుతుండటంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తాజాగా రానున్న రెండు గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల్లో రానున్న 2 గంటల వరకూ భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో రాత్రి సమయంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడతాయని, హైదరాబాద్ లో చిరుజల్లులు పడతాయని అంచనా వేశారు.

Next Story