కొడంగల్ లో తెగిపడిన విద్యుత్ తీగ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

by Taduka Kalyani |   (  Updated:2026-07-03 13:28:19  IST  )

కొడంగల్ పట్టణంలో మరోసారి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణంలోని తాండూర్ రోడ్డు మార్గంలో గల బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో శుక్రవారం ఒక్కసారిగా హైటెన్షన్/విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడింది.

కొడంగల్ లో తెగిపడిన విద్యుత్ తీగ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
X

దిశ,కొడంగల్: కొడంగల్ పట్టణంలో మరోసారి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణంలోని తాండూర్ రోడ్డు మార్గంలో గల బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో శుక్రవారం ఒక్కసారిగా హైటెన్షన్/విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడింది. తీగ తెగిపడిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

షాపుల యజమానుల ఆవేదన:

ఈ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడటం ఇదే మొదటిసారి కాదని, ఇక్కడ తరచూ తీగలు తెగుతూనే ఉన్నాయని స్థానిక దుకాణదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజలు, వాహనదారులతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై ఇలా పదే పదే లైన్లు తెగడం ప్రాణాలకే ముప్పని వారు ఆందోళన చెందుతున్నారు.

శాశ్వత పరిష్కారం చూపాలి:

ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, పాతబడిన విద్యుత్ తీగల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Next Story