- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చత్రపతి విగ్రహ నిర్మాణ–స్మృతివనానికి రూ.1 లక్ష విరాళం..
చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం, స్మృతివన అభివృద్ధి అంబత్రేయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆదిత్య పరశ్రీ గారు శుక్రవారం నాడు లక్ష రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు అందజేశారు.

దిశ, నారాయణపేటప్రతినిధి: చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం, స్మృతివన అభివృద్ధి అంబత్రేయ క్షేత్రం వ్యవస్థాపకులు ఆదిత్య పరశ్రీ గారు శుక్రవారం నాడు లక్ష రూపాయల విరాళాన్ని నిర్వాహకులకు అందజేశారు. నేపథ్యంలో అనంతరం పరమపూజ్య శ్రీ ఆదిత్యపారశ్రీ గురువులను చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ యోజనా సంఘం సభ్యులు ఘనంగా ఆహ్వానించి, శాలువాతో సత్కరించి సన్మానించారు. ప్రాజెక్టు విశేషాలను శ్రద్ధగా ఆలకించిన పరమపూజ్య గురువులు హర్షం వ్యక్తం చేస్తూ, దేశంలోనే ఆదర్శప్రాయమైన స్మృతివనంగా నారాయణపేట రూపుదిద్దుకోవడం అత్యంత గర్వకారణమని పేర్కొన్నారు.
అవసరమైన సహకారాన్ని నిరంతరం అందిస్తాం..
జాతి చైతన్యాన్ని, భారతీయ సంస్కృతి వైభవాన్ని, చరిత్ర స్ఫూర్తిని భావితరాలకు చేరవేసే ఈ మహత్తర యజ్ఞానికి తమ పీఠం సంపూర్ణ ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని ప్రకటించారు. ఈ సందర్భంగా తొలి విడతగా తమ పీఠం తరఫున రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కూడా ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అన్ని విధాలుగా అండదండలుగా నిలిచి, అవసరమైన సహకారాన్ని నిరంతరం అందిస్తామని గురువులు భరోసా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యోజనా సంఘం గౌరవాధ్యక్షులు కురుమన్న, అధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి శ్రీపాద, ఉపాధ్యక్షులు వెంకటేష్ గౌడ్, పల్లా రఘు, మహాదేవ్, నవీన్, గోపీకృష్ణ, జిత్తూ పటేల్, అప్పి, బాలరాజు, భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ సీనియర్ నాయకులు రఘువీర్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.






