మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ధృవ్ విక్రమ్.. హిట్ కోసం కొత్త దర్వకుడితో సాహసం!

by Mallepaka Hamsa |

పుకార్లన్నీ నిజం చేస్తూ, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు మేకర్స్. ధృవ్ విక్రమ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా వస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ధృవ్ విక్రమ్.. హిట్ కోసం కొత్త దర్వకుడితో సాహసం!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ధృవ్ విక్రమ్. ‘ఆదిత్య వర్మ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధృవ్.. తన మొదటి చిత్రంతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. గత ఏడాది వచ్చిన ‘బైసన్’ చిత్రం కూడా ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న ధృవ్ విక్రమ్, ప్రస్తుతం తన నాలుగో ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టారు. గత కొద్ది రోజులుగా ధృవ్ విక్రమ్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఆ పుకార్లన్నీ నిజం చేస్తూ, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించారు మేకర్స్. ధృవ్ విక్రమ్ కెరీర్‌లో నాలుగో చిత్రంగా వస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. DV4 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాతో కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు.

కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేనీ, యలమంచలి రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే పూజా కార్యక్రమానికి కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల ‘డ్యూడ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ దర్శకుడు కీర్తీశ్వరన్ క్లాప్ కొట్టి ఈ కొత్త సినిమాను అధికారికంగా ప్రారంభించారు. అయితే తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను చాలా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఫ్లాపులతో సతమతమవుతున్న ధృవ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కొత్త దర్శకుడితో భారీ సాహసమే చేసేందుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సక్సెస్‌ఫుల్ బ్యానర్ తోడుండటంతో ఈ సినిమాతో ధృవ్ విక్రమ్ ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

Next Story