స్పీడ్ పోస్ట్ గంజాయి దందా పై పంజా.. సిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్!

by Jakkula.Mamatha |

ఏదైనా అత్యవసర సమాచారానికి సంబంధించిన పత్రాలను లేదా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను వేగంగా పంపేందుకు మనం పోస్టల్ సర్వీస్ లోని స్పీడ్ పోస్ట్ సేవలను ఉపయోగిస్తాం.

స్పీడ్ పోస్ట్ గంజాయి దందా పై పంజా.. సిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్!
X

దిశ, సిటీ క్రైమ్: ఏదైనా అత్యవసర సమాచారానికి సంబంధించిన పత్రాలను లేదా ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను వేగంగా పంపేందుకు మనం పోస్టల్ సర్వీస్ లోని స్పీడ్ పోస్ట్ సేవలను ఉపయోగిస్తాం. కానీ గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు ఇదే స్పీడ్ పోస్ట్ సేవలు వారి గంజాయి దందాకు ఉపయోగిస్తుండడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారధ్యంలోని పోలీసులు దేశ వ్యాప్తంగా నడుస్తున్న స్పీడ్ పోస్ట్ గంజాయి దందా నెట్ వర్క్ ను భగ్నం చేశారు. ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి స్మగ్లర్ వినియోగదారులకు అత్యంత వేగంగా గంజాయి పౌడర్‌ను సరఫరా చేస్తూ పోలీసుల కళ్లు కప్పుతున్నారు. ఈ స్పీడ్ పోస్టు గంజాయి దందా పై సమాచారం అందిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్‌ను నిర్వహించి జాతీయ గంజాయి స్మగ్లర్ల నెట్ వర్క్‌ను కుదుపేశారు. ఈ సాయంత్రం సీపీ సజ్జనార్ స్పీడ్ పోస్ట్ ద్వారా నడుస్తున్న గంజాయి దందా పై వివరాలు వెల్లడించనున్నారు.

Next Story