- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై 200 కిలోల గంజాయి పట్టివేత
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అక్రమంగా తరలిస్తున్న సుమారు 200 కిలోల గంజాయిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు, సత్తుపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.

దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అక్రమంగా తరలిస్తున్న సుమారు 200 కిలోల గంజాయిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు, సత్తుపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు టయోటా ఎతియోస్ కారులో గంజాయి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో టీజీఏఎన్‌బీ బృందం, సత్తుపల్లి పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. వేంసూరు మండలం గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న ఏపీ 39 ఏటీ 8420 నంబర్ గల టయోటా ఎతియోస్ కారును రేజర్ల సమీపంలో తనిఖీ చేయగా, అందులో సుమారు **200 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు గంజాయి సరఫరా నెట్‌వర్క్, ఇతర నిందితుల ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






