- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల మాట నమ్మి ఇల్లు కూల్చింది.. ఇప్పుడు నిలువ నీడ లేక అవస్థలు
అధికారుల సూచనలు నమ్మి.. ఉన్న ఏకైక పాత ఇంటిని కూల్చి వేసిన ఓ మహిళకు ఎనిమిది నెలలు గడిచినా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకపోవడంతో నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న ఘటన మండల కేంద్రం రాయపోల్‌లో వెలుగుచూసింది.

దిశ,రాయపోల్: అధికారుల సూచనలు నమ్మి.. ఉన్న ఏకైక పాత ఇంటిని కూల్చి వేసిన ఓ మహిళకు ఎనిమిది నెలలు గడిచినా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకపోవడంతో నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న ఘటన మండల కేంద్రం రాయపోల్‌లో వెలుగుచూసింది. రాయపోల్ గ్రామానికి చెందిన ఉషణగళ్ల కవిత తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి విడతలో తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు చెప్పడంతో, కొత్త ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్చి వేయాలని సూచించారు. అధికారుల మాట నమ్మి ఉన్న ఇంటిని పూర్తిగా కూల్చివేశారు.
అనంతరం ఇంటి స్థలంలో గుర్తులు (ముగ్గు) వేయడానికి వచ్చిన అధికారులు, ఆన్‌లైన్‌లో పేరు మిస్సైందని చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇల్లు కూల్చివేసి దాదాపు ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నివాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆన్‌లైన్‌లో నమోదైన లోపాన్ని వెంటనే సరిచేసి తమకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని అందజేసి న్యాయం చేయాలని బాధితురాలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.






