Bomb Threat: ఇస్రోకు బాంబు బెదిరింపు.. ఏకంగా చైర్మన్‌‌కు ఈమెయిల్ పంపిన దుండగులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-02 10:49:21  IST  )

ఏకంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్‌కు దుండగులు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ పంపడం కలకలం రేపుతోంది.

Bomb Threat: ఇస్రోకు బాంబు బెదిరింపు.. ఏకంగా చైర్మన్‌‌కు ఈమెయిల్ పంపిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru)లోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇవాళ మధ్యాహ్నం ఇస్రో హెడ్‌ ఆఫీసుకు గుర్తు తెలియని దుండగుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్ నేరుగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్‌‌కు పంపించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష సంస్థకు, అది కూడా నేరుగా అధిపతికే ఇలాంటి బెదిరింపు రావడంతో బెంగళూరు పోలీసులతో పాటు భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ఇస్రో ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. బాంబు బెదరింపులకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story