- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరుగైన వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి : అడిషనల్ కలెక్టర్
స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు మెరుగైన సమగ్ర ఆరోగ్య పరీక్షల నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు మెరుగైన సమగ్ర ఆరోగ్య పరీక్షల నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు గురువారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్ లో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 1,94,493 మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ దశలవారీగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షలు, నమూనాల సేకరణ, డేటా నమోదు, ఫాలోఅప్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు డీఆర్‌డీఏ, మేప్మా, మున్సిపల్ శాఖల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ
జిల్లాలోని పోచంపల్లి, షారాజీపేట్, బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మాస్టర్ ట్రైనింగ్ కేంద్రాలుగా గుర్తించి, ఒక్కో కేంద్రం నుంచి ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ అందించినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ల ద్వారా జిల్లాలోని మిగిలిన ఆరోగ్య సిబ్బందికి దశలవారీగా శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీ-డయాగ్నోస్టిక్స్ రాష్ట్ర సమన్వయకర్త (State Coordinator) శ్రీ భరత్ పాల్గొని, సమగ్ర ఆరోగ్య పరీక్షల నిర్వహణ విధానం, నమూనాల సేకరణలో పాటించాల్సిన ప్రమాణాలు, డేటా నమోదు, నాణ్యత నియంత్రణ, నివేదికల నిర్వహణ తదితర అంశాలపై వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు మరియు సంబంధిత శాఖల సిబ్బందికి సవివరంగా శిక్షణ అందించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, టీ-డయాగ్నోస్టిక్స్ రాష్ట్ర సమన్వయకర్త భరత్ తదితరులు పాల్గొన్నారు.






