- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలని అడిగినందుకే లాఠీచార్జీ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

దిశ, తిరుమలగిరి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఉప్పల్ బాగాయత్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న క్రమంలో బొల్లారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలనే ఉద్యమకారులు అడుగుతున్నారని, వాటిని అమలు చేయకుండా ఉండడం అన్యాయమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన **250 గజాల ఇంటి స్థలాన్ని** ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ హక్కు కోసం ప్రశ్నించిన ఉద్యమకారులపై లాఠీచార్జీ చేయించి వారి రక్తం చిందించే పరిస్థితి తీసుకువచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఉద్యమకారులపై జరిగిన ఈ చర్యతో కాంగ్రెస్ ప్రభుత్వానికి "ఈ రోజు నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది" అని కవిత వ్యాఖ్యానించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






