కేతన్‌ను సియానే నెట్టేసిందనేందుకు ఆధారాల్లేవ్ : పోలీసులు

by Naga Rani Yarlagadda |

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

కేతన్‌ను సియానే నెట్టేసిందనేందుకు ఆధారాల్లేవ్ : పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అంతకంటే ముందు.. సియానే కేతన్ ను పై నుంచి నెట్టివేసిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులకు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్ వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమన్నారు. తాజా ఆధారాలను అందించేందుకు ఈ టెస్టులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కాగా.. ఇప్పటికే సియా, చేతన్ లను పోలీసులు లోహగడ్ కోటకు తీసుకెళ్లి సీన్ రీ క్రియేట్ చేశారు. 25 మంది అధికారుల సమక్షంలో క్రైమ్ సీన్ ను రీ కన్స్ట్రక్ట్ చేశారు. నిందితుడు చేతన్ నడకతీరు, శారీరక హావభావాలు, ఎత్తు, శరీర నిర్మాణాన్ని రికార్డు చేశారు. ఫోరెన్సిల్ ల్యాబ్ లో రుజువయ్యే ఈ గేట్ అనాలిసిస్ ఆధారాలను కోర్టులో సవాల్ చేయడం డిఫెన్స్ లాయర్లకు చాలా కష్టమని నిపుణులు చెప్తున్నారు.

Next Story