పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం: కేంద్రపథకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-02 08:11:38  IST  )

తిరుపతి జిల్లా ముక్కావారిపాల్లెలో సీఎం చంద్రబాబు పర్యటించారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి వీబీ జీరామ్‌జీ పథకాన్ని ప్రారంభించారు...

పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం: కేంద్రపథకంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె(Mukkavaripalle)లో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పర్యటించారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్(Union Minister Sivarajsing), రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan)తో కలిసి వీబీ జీరామ్‌జీ పథకాన్ని(V.B. Jeeramji Scheme) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ వీబీజీ‌రామ్‌జీ పథకాన్ని పూర్తి వినియోగించుకుంటామన్నారు. వీబీజీ రామ్‌జీ నిధులతో గ్రామాలు బాగుపడతాయని తెలిపారు. కోడూరు- వెంకటగిరి రహదారి(Koduru-Venkatagiri Road)ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. రూ. 5 కోట్లతో కోడూరులో బస్టాండ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఏది అడిగినా ఇస్తున్నారు..

రాష్ట్రానికి ఏం కావాలని అడిగినా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే ఇస్తున్నారని తెలిపారు. మదనపల్లెలో హార్టీకల్చర్ క్లబ్‌ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చే వరకూ రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందన్నారు. 2019-24 మధ్య నరేగా నిధులను పక్కదారి పట్టించారని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉందని, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story