బీఆర్ఎస్ నేతలెవరూ చర్చకు రాలేదు : మంత్రి అడ్లూరి

by Naga Rani Yarlagadda |

గురుకులాల్లో అవినీతిపై చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లను గన్ పార్క్ వద్దకు రావాలని కోరామని మండ్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

బీఆర్ఎస్ నేతలెవరూ చర్చకు రాలేదు : మంత్రి అడ్లూరి
X

దిశ, వెబ్‌డెస్క్: గురుకులాల్లో అవినీతిపై చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లను గన్ పార్క్ వద్దకు రావాలని కోరామని మండ్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ ముగ్గురు మంత్రులం, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలంతా ఎదురుచూశామని, చర్చకు ఎవరూ రాలేదని పేర్కొన్నారు. చాలా సమయంపాటు ఎదురుచూశామని, ఎవ్వరూ రాకపోవడంతో అక్కడి నుంచి CLP ఆఫీసుకు వెళ్లిపోయామని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే మాజీ ముఖ్యమంత్రిని ఫాంహౌస్ నుంచి బయటికి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ భవన్ లో రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం కేటీఆర్ ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తాను కూడా గన్ పార్క్ వద్దకే వెళ్తున్నానని, అక్కడే చర్చించేందుకు వెళ్తున్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హరీష్ రావు అక్కడికే వెళ్తున్నారని తెలిసి, తాను కూడా అక్కడికే వెళ్తున్నానని, కేటీఆర్ కూడా అక్కడికే రావాలన్నారు. ఇంతలో అనూహ్యంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పీఎస్ కు తరలించారు.

Next Story