- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pooja Hegde: ఆ టాలీవుడ్ హీరో నటన అద్భుతం.. పూజా హెగ్డే ప్రశంసలు
నాని నటించిన 'నిన్ను కోరి' సినిమా తనకు ఎంతో ఇష్టమని, ఆ చిత్రంలో ఆయన నటన అద్భుతంగా ఉందని పూజా హెగ్డే ప్రశంసించింది.

దిశ, వెబ్ డెస్క్: క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు చిత్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సమయంలోనే తమిళం, హిందీ చిత్రాలపై కూడా దృష్టి సారించింది. ఇక తాజాగా ఓ టాలీవుడ్ హీరో నటనపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. పూజా హెగ్డే మాట్లాడుతూ.. "నాని హీరోగా నటించిన 'నిన్ను కోరి' సినిమా నాకు చాలా ఇష్టం. ఆ చిత్రంలో నాని నటన అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన నటన నన్నెంతో ఆకట్టుకుంది" అని తెలిపింది.
ఇప్పటివరకు పూజా హెగ్డే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించినప్పటికీ, నానితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో నాని నటనను ఇంతగా ప్రశంసించడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశాలపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' చిత్రంలో నటిస్తుండగా, త్వరలోనే 'బ్లడీ రోమియో' సినిమాను ప్రారంభించనున్నాడు. మరోవైపు పూజా హెగ్డే వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆమెకు ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు.






