‘దిశ’ ఎఫెక్ట్.. చేర్యాల మండల వ్యవసాయ అధికారి సస్పెండ్

by Jakkula.Mamatha |

చేర్యాల మండల కేంద్రంలోని శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్‌లో జరిగిన 6429 బస్తాల సబ్సిడీ యూరియా పక్కదారి మళ్లింపు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామిని విధుల నుంచి, సదరు ఫర్టిలైజర్ దుకాణ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘దిశ’ ఎఫెక్ట్.. చేర్యాల మండల వ్యవసాయ అధికారి సస్పెండ్
X

దిశ, చేర్యాల: చేర్యాల మండల కేంద్రంలోని శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్‌లో జరిగిన 6429 బస్తాల సబ్సిడీ యూరియా పక్కదారి మళ్లింపు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామిని విధుల నుంచి, సదరు ఫర్టిలైజర్ దుకాణ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రైతులకు అందవలసిన సబ్సిడీ యూరియాను ఫెర్టిలైజర్స్ దుకాణ యజమానులు పక్కదారి పట్టించి అవకతవకలకు పాల్పడి రైతులకు అందకుండా చేస్తున్నారని, దుకాణంలో స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అవకతవకలు గుర్తించవలసిన మండల వ్యవసాయ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే వరుస కథనాలు ‘దిశ’ పత్రిక ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. అయితే.. ఎవరైనా రైతులకు అందవలసిన యూరియాను అక్రమంగా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

Next Story