- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట పొలాల చుట్టూ అక్రమ విద్యుత్ తీగలు అమర్చడం నేరం:ఎస్సై
రైతులు తమ పంట పొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకోవడానికి పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడం చట్ట విరుద్ధమని మందమర్రి ఎస్సై గోపతి నరేష్ హెచ్చరించారు.

దిశ, మందమర్రి: రైతులు తమ పంట పొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకోవడానికి పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడం చట్ట విరుద్ధమని మందమర్రి ఎస్సై గోపతి నరేష్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో కొంతమంది రైతులు తమ పంటలను అడవి జంతువుల (కోతులు, అడవి పందులు) నుండి రక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో పంట పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అన్నారు. ఇలాంటి అనాలోచిత, చట్టవ్యతిరేక పనులు ద్వారా పొరపాటున ఆ విద్యుత్ తీగలను తాకిన అమాయక ప్రజలు, పశువుల కాపరులు మరియు పొలం పనులకు వెళ్లే కూలీలు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.
అడవి జంతువుల నివారణ కోసం విద్యుత్ లైన్ల నుంచి నేరుగా అక్రమంగా కరెంట్ కనెక్షన్లు పెట్టడం చట్ట ప్రకారం నేరం.. అక్రమ కరెంట్ తీగల వల్ల ఎవరికైనా ప్రాణనష్టం సంభవిస్తే, సదరు భూ యజమానిపై అదేవిధంగా కనెక్షన్ పెట్టిన వ్యక్తి పై కూడా నేరపూరిత మానవ హత్య కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించడం జరుగుతుందని ఎస్సై నరేష్ హెచ్చరించారు. పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా పొలాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అక్రమ కనెక్షన్లు పాల్పడితే విద్యుత్ చట్టాల ప్రకారం భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు. ఇలాంటి అక్రమ విద్యుత్ కనెక్షన్ల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే మందమర్రి పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా డయల్ 100కి కానీ సమాచారం అందించాలని ఎస్సై నరేష్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడును అని తెలిపారు.






