రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Taduka Kalyani |

కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ,కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. రైల్వే ఎస్సై కథనం ప్రకారం.. ట్రాక్ నెంబర్ 513/9-10 వద్ద 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు సుమారు 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగు, గుండ్రటి ముఖం, నల్లని వెంట్రుకలు కలిగి ఉన్నాడు. కుడి చేతిపై "జె నర్సింలు" అనే పచ్చబొట్టు ఉండగా, అదే చేతికి వెండి కడియం ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారంతో రాగి తాయెత్తు ఉంది. మృతుడు తెలుపు రంగు, గోధుమ రంగు పూల డిజైన్ ఉన్న షర్టు, గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా బంధువులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్‌ ఎస్సై సాధు లింబాద్రిని 87126 58614 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Next Story