- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటరు జాబితా సవరణ వేగవంతం.. సందేహాల నివృత్తికి ప్రత్యేక హెల్ప్‌డెస్క్
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.

దిశ, నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు దరఖాస్తుల పంపిణీ పూర్తయిందని, ఫారాలు అందుకున్న ప్రతి ఓటరు వాటిని పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్‌వోలకు సమర్పించాలని పెద్దవూర మండల రెవెన్యూ ప్రోటోకాల్ అధికారి, ఆర్‌ఐ దండ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. దరఖాస్తులు నింపే ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి సందేహాలు తలెత్తినా వాటిని వెంటనే నివృత్తి చేసేందుకు పెద్దవూర తహసీల్దార్ ఖాసీం నాయక్ ఆదేశాల మేరకు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు వినియోగించుకుని తమ దరఖాస్తులను సక్రమంగా పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికీ ఎస్‌ఐఆర్ దరఖాస్తులు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే సంబంధిత బీఎల్‌వోను లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి ఫారాలు పొందాలని సూచించారు. గడువులోగా దరఖాస్తులు సమర్పించని పక్షంలో ఓటరు జాబితాలో పేరు కొనసాగింపుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం మున్సిపాలిటీ పరిధిలో సజావుగా కొనసాగుతోందని దండ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.






