వన మహోత్సవానికి నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచాలి : కలెక్టర్

by Taduka Kalyani |

వన మహోత్సవానికి కావాల్సిన మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చి వర్షాలు కురవగానే మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

వన మహోత్సవానికి నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉంచాలి : కలెక్టర్
X

దిశ, ఎల్లారెడ్డి: వన మహోత్సవానికి కావాల్సిన మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చి వర్షాలు కురవగానే మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై శ్రద్ధ చూపేలా అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం గండి మాసానీపెట్ గ్రామంలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. పాడి పరిశ్రమ పెంపొందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మహిళా సంఘాల అభివృద్ధికి పాడి పరిశ్రమ తోడు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం మాచాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ చిన్నారులకు, గర్భిణీలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. గ్రామంలో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు అర్హులైన ఓటర్లు తప్పిపోకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని బిఎల్ఓ లకు సూచించారు. అవగాహన లేని ప్రజలకు ఫారాలను నింపి ఇవ్వాలన్నారు. అనంతరం పెద్ద చెరువు కట్ట పై జరుగుతున్న నిర్మాణ పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని అదేవిధంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న అమృత్ 2.0 పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ కౌన్సిలర్లు కలెక్టర్ ను కలిసి పెద్ద చెరువులో నీటిమట్టం తగ్గిన తర్వాత పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.

మత్త మాల ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని రైతులకు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, తహశీల్దార్​ ప్రేమ్​, డి ఎల్ పీ ఓ సురేందర్, ఎంపీడీవో తాహేరా బేగం పాల్గొన్నారు.

Next Story