మానసిక పరిపక్వత లేని పిచ్చోడు: జగన్‌పై డీబీవీ ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-02 14:10:30  IST  )

మారీచుడు వేషం మార్చినట్టు రాజధానిపై జగన్ మాట మారుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ...

మానసిక పరిపక్వత లేని పిచ్చోడు: జగన్‌పై డీబీవీ ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో / ఒంగోలు: మారీచుడు వేషం మార్చినట్టు రాజధానిపై జగన్ మాట మారుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. గురువారం ఒంగోలులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మానసిక పరిపక్వత లేని పిచ్చోడిలా జగన్ మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానిగా పార్లమెంటు ఆమోదించిందని, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఇప్పుడు మావిగన్ అంటూ జగన్ ఎవరిని మభ్య పెట్టడానికి అని ప్రశ్నించారు. జగన్ ఎజెండా మోసం, ఆచరణ వంచించడమన్నారు. నాడు మూడు రాజధానులు అన్నాడని, మొన్న అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అన్నాడని, మళ్లీ మావిగన్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. పిచ్చోడిలా మాట్లాడుతున్న జగన్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, జగన్ వ్యాఖ్యలు చూసి చిన్నపిల్లలు సైతం నవ్వుకుంటున్నారని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి విమర్శించారు.

Next Story