జిల్లా కలెక్టర్, ఎస్పీకి జాతీయ ఎస్సీ కమిషన్ రిమైండర్ నోటీసు

by Ratna Kumari |

కాటారం మండలానికి చెందిన రామిల్ల రాజబాపు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి అప్పటి కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్‌పై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ రెండోసారి రిమైండర్ నోటీసు జారీ చేసినట్లు ఫిర్యాదుదారుడు రామిల్ల రాజబాపు తెలిపారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీకి జాతీయ ఎస్సీ కమిషన్ రిమైండర్ నోటీసు
X

దిశ, కాటారం : కాటారం మండలానికి చెందిన రామిల్ల రాజబాపు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి అప్పటి కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్‌పై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ రెండోసారి రిమైండర్ నోటీసు జారీ చేసినట్లు ఫిర్యాదుదారుడు రామిల్ల రాజబాపు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ, భూపాలపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఈ-మెయిల్ ద్వారా రిమైండర్ నోటీసు పంపినట్లు ఆయన వెల్లడించారు. తాను చేసిన ఫిర్యాదుపై సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించినట్లు రామిల్ల రాజబాపు పేర్కొన్నారు.

Next Story