డ్రగ్స్, మద్యం మత్తులో డ్రైవింగ్‌కు చెక్.. డీజీపీకి బీఆర్ఆర్ ఫౌండేషన్ వినతి

by Batti.Sumithra |

డ్రగ్స్, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి వినతిపత్రం అందజేశారు.

డ్రగ్స్, మద్యం మత్తులో డ్రైవింగ్‌కు చెక్.. డీజీపీకి బీఆర్ఆర్ ఫౌండేషన్ వినతి
X

దిశ, ఇబ్రహీంపట్నం : డ్రగ్స్, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. మద్యం మత్తు, డ్రగ్స్, గంజాయి, నిద్రమత్తు వంటి ప్రభావంలో వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షా కిట్లను వినియోగించి అనుమానిత వాహనదారులకు పరీక్షలు నిర్వహించి, పాజిటివ్‌గా తేలిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా యువత ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు బీఆర్ఆర్ ఫౌండేషన్ రూపొందించిన ప్రత్యేక వాల్ పోస్టర్‌ను డీజీపీ సీవీ ఆనంద్ ఆవిష్కరించారు. సమాజంలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డిజిటల్ నేరాలకు దూరంగా ఉండాలని ఈ పోస్టర్ ద్వారా సందేశం అందించారు. సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, యువతలో చట్టాల పై అవగాహన పెంపొందించడం వంటి అంశాల్లో పోలీసు శాఖకు తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని బూడిద రాంరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story