రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమా?

by Taduka Kalyani |

నిజామాబాద్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులతో స్నేహపూర్వక రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో తాను వ్యవహరిస్తున్నానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు.

రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమా?
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలో స్నేహపూర్వక రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు కొనసాగించాలన్న తలంపుతో నేను రాజకీయం చేస్తున్నానని.. కానీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్ కుమార్ వ్యక్తిగత దూషణలు తనకు ఆగ్రహం కలిగించాయని, దమ్ముంటే పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామన్నారు. గురువారం బిజెపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్లో రాజీనామాలతో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూసుకుందామని.. ఒడినోల్లం శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుందామని టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. జిల్లాలో అభివృద్ధి శూన్యమన్నారు. కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని ఎమ్మెల్సీ పదవి కానీ, పీసీసీ అధ్యక్ష పదవి గాని ఎలా వచ్చిందో లాబీయింగ్ ఎలా చేశావో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలుపు డోర్ తట్టని మహేష్ కుమార్ గౌడ్ తన గురించి మాట్లాడటం హాస్యాస్పదమని , సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి జిల్లాకు అన్యాయం చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కి అతి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు మాత్రమే నిధులు ఇస్తుందని, ఎక్కడ కూడా మిగతా జిల్లాలకు అరకొర నిధులు తప్ప భారీ స్థాయిలో నిధులు ఇచ్చిన పాపాన పోవడం లేదన్నారు.

దమ్ముంటే ప్రత్యక్ష చర్చకు రా..

నెలకు ఒకసారి ఢిల్లీకి సూట్ కేసులు మోస్తూ రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పదవులు కాపాడు కుంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు 210 లేఖలు రాసిన నిధులు మాత్రం మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పై రాకేష్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చి రాజకీయ చతురత చూపాలన్నారు. ఈరవత్రి అనిల్ కుమార్ భూమికి మూడు అడుగులు మాత్రమే ఉన్నాడని, తనను నరుకుతా అని వ్యక్తిగత దూషణలు చేసిన అనిల్ కుమార్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే తీవ్రంగా హెచ్చరించారు. అనిల్ కుమార్ మరొకసారి ఇలాంటి విమర్శలు తనపై చేస్తే బాగుండదని, ఊరుకునే ప్రసక్తే లేదని, దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కొట్లాడాలని, ఆర్మూర్ లో పోటీ చేయాలనుకుంటే పోటీలో నిలిచి పోరాడాలి అని రాకేష్ రెడ్డి అన్నారు. కానీ ఇలా దిగజారుడు మాటలతో రాజకీయం చేయడం.. రాజకీయ విలువలను వ్యక్తుల స్థాయిని తగ్గిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే నేను ప్రత్యక్ష చర్చకు ఎప్పుడైనా సిద్ధమని, దమ్ముంటే రావాలని లేదా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీలో నిలబడతానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. సెమీ ఫైనల్ ఎన్నికగా.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బీజేపీ ప్రభుత్వానికి సూచికగా ఆర్మూర్ అసెంబ్లీ బై ఎలక్షన్ అని అన్నారు.ఈ సమావేశంలో కిసాన్ మోర్ఛ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాసరెడ్డి, బిజెపి నాయకులు ప్రమోద్, నాగుల లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Next Story