రాష్ట్రంలోనే తొలి సోషల్ ఆడిట్ గ్రామంగా కానుకుంట

by Batti.Sumithra |

రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గ్రామైక్య మహిళా సంఘాల సోషల్ ఆడిట్ పూర్తిచేసిన గ్రామంగా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామం నిలిచిందని రాష్ట్ర స్థాయి సీఆర్డీ ఉషారాణి తెలిపారు.

రాష్ట్రంలోనే తొలి సోషల్ ఆడిట్ గ్రామంగా కానుకుంట
X

దిశ, జిన్నారం : రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గ్రామైక్య మహిళా సంఘాల సోషల్ ఆడిట్ పూర్తిచేసిన గ్రామంగా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామం నిలిచిందని రాష్ట్ర స్థాయి సీఆర్డీ ఉషారాణి తెలిపారు. గ్రామంలో రెండు గ్రామైక్య సంఘాల పరిధిలో 34 మహిళా సంఘాలు ఉండగా, అన్ని 34 మహిళా సంఘాల సోషల్ ఆడిట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంపై ఆమె అభినందనలు తెలిపారు. సోషల్ ఆడిట్‌ను గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నిర్వహించినట్లు వెల్లడించారు. సోషల్ ఆడిట్‌లో గుర్తించిన అన్ని అంశాలను మహిళా గ్రామసభను ఏర్పాటు చేసి, సంఘ సభ్యులకు వివరించినట్లు తెలిపారు. సోషల్ ఆడిట్‌లో గమనించిన అంశాలను మహిళలకు పూర్తిగా అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రాజేష్, జిల్లా స్థాయి అధికారి జాన్ కెనడి, డీపీఎం, ఏపీఎం నరేందర్, సీసీలు వరలక్ష్మి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Next Story