- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : NEET, JEE లో భారీ మార్పులు! 50% వెయిటేజీ?
దేశంలో కీలక ప్రవేశ పరీక్షలైన నీట్(NEET), జేఈఈ(JEE)ల్లో భారీ మార్పులు తీసుకురాబోతున్నట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కీలక ప్రవేశ పరీక్షలైన నీట్(NEET), జేఈఈ(JEE)ల్లో భారీ మార్పులు తీసుకురాబోతున్నట్టు సమాచారం. కేవలం ప్రవేశ పరీక్షల మార్కులే కాకుండా బోర్డు పరీక్షల మార్కుల్లో గణనీయమైన వెయిటేజీ కల్పించే దిశగా కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల మార్కులు, ఆయా బోర్డు పరీక్షల మార్కుల వెయిటేజీ 50 - 50 గా మార్చనున్నట్టు కేంద్ర విద్యాశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో నీట్, జేఈఈ వంటి పరీక్షల్లో వచ్చిన లీకేజీ వివాదాలు, వాల్యుయేషన్ లోపాల నేపథ్యంలో విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల కమిటీ ఈ సిఫార్సులను పరిశీలిస్తోంది. ప్రవేశ పరీక్షలను మరింత పారదర్శకంగా మార్చేందుకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను (CBT) అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు.. అయితే కేవలం ఎంట్రెన్స్ పరీక్షల కోసమే విద్యార్థులు లక్షల రూపాయలు కుమ్మరించి, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం, వాటి వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించడం కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






