- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేయించిన పల్లీల్లో బొద్దింక
by Ratna Kumari |
మందు సేవిస్తూ మంచింగ్‌గా వేయించిన పల్లీలు ఆర్డర్ చేస్తే.. వాటితో పాటు బొద్దింక కూడా వడ్డించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఓ పర్మిట్ రూమ్‌లో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, తంగళ్లపల్లి : మందు సేవిస్తూ మంచింగ్‌గా వేయించిన పల్లీలు ఆర్డర్ చేస్తే.. వాటితో పాటు బొద్దింక కూడా వడ్డించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఓ పర్మిట్ రూమ్‌లో గురువారం చోటుచేసుకుంది. మందు తాగేందుకు వచ్చిన వినియోగదారులు మంచింగ్ కోసం వేయించిన పల్లీలు ఆర్డర్ చేయగా, వాటిలో వేయించిన బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆహార పదార్థాల తయారీలో కనీస పరిశుభ్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆరోపించారు. ఇప్పటికే జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి కలకలం రేపింది. సంబంధిత పర్మిట్ రూమ్ యాజమాన్యంపై ఆహార భద్రత, ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story






