- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్ : వృద్ధాప్యాన్ని జయించడం సాధ్యం కాదా? కనీసం త్వరగా రాకుండా ఆపలేమా? చాలా కాలంగా శాస్త్రవేత్తలను సైతం వెంటాడుతున్న సందేహాలివి. ఇప్పటి వరకు పరిశోధకకులు కూడా మానవుల్లో వృద్ధాప్యం అనేది ఆపలేని సహజ ప్రక్రియగా భావించేవారు. కానీ ఇప్పుడిప్పుడే ఈ ఆలోచనలు, అభిప్రాయాలు మారుతున్నాయి. ఎందుకంటే.. మాయిక్ మష్రూమ్‌లలో ఉండే ‘ప్సిలోసిన్’ అనే సమ్మేళనం మానవ కణాల జీవితకాలాన్ని పెంచుతుందని ఒక కొత్త ల్యాబ్ అధ్యయనం గుర్తించింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎమరీ యూనివర్సిటీ (Emory University)& బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (Baylor College of Medicine) కలిసి నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. శాస్త్రవేత్తలు మానవ కణాలను మాయిక్ మష్రూమ్‌లలో ఉండే ‘ప్సిలోసిన్’తో చికిత్స చేయగా.. అవి సాధారణ కణాలకంటే 29% నుంచి 57% వరకు ఎక్కువ కాలం జీవించాయి. అంతేకాకుండా కణాలలో వృద్ధాప్య సంకేతాలు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గడం వంటి మెరుగైన లక్షణాలు కనిపించాయి. అదే సమ్మేళనం వృతగ్గడం వంటి మెరుగైన లక్షణాలు కనిపించాయి. అదే సమ్మేళనం వృద్ధుల్లోనూ*జీవితకాలం పెంచినట్టు గమనించారు.
అయితే ఇప్పటికిప్పుడు ఈ సమ్మేళనం మాత్రమే వృద్ధాప్యానికి పూర్తి నివారణ కాదని, పరిశోధనలు ఇంకా ల్యాబ్ దశలోనే ఉన్నాయని, మనుషుల్లో ప్రయోగాలు జరగాల్సి ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా వృద్ధాప్యాన్ని కూడా కొంతవరకు ఆలస్యం చేసుకోగలిగే అవకాశాలపై ఈ పరిశోధన ఆసక్తి రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయనే ఆశలు రేకెత్తిస్తోంది.






