- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాత్రూమ్‌లో జారి పడిన అఖిల్.. 48 కుట్లు పడ్డాయంటూ షాకింగ్ కామెంట్స్
తాను ఒకరోజు ఇంట్లోని బాత్‌రూమ్ ఫ్లోర్ తడిగా ఉండటంతో అకస్మాత్తుగా కాలు జారి కింద పడిపోయానని అఖిల్ చెప్పారు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘అఖిల్’ సినిమాతో హీరోగా వచ్చిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన హిట్ సాధించలేకపోయారు. ఇక 2023లో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మూడేళ్లపాటు ఇండస్ట్రీకి దూరం అయిన ఆయన మళ్లీ ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘ఏజెంట్’ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత తనకు ఒక ఊహించని పెద్ద యాక్సిడెంట్ జరిగిందని ఆయన వెల్లడించారు.
తాను ఒకరోజు ఇంట్లోని బాత్‌రూమ్ ఫ్లోర్ తడిగా ఉండటంతో అకస్మాత్తుగా కాలు జారి కింద పడిపోయానని అఖిల్ చెప్పారు. దురదృష్టవశాత్తూ తాను కింద పడిన చోట ఒక పగిలిన గాజు ముక్క ఉండటంతో, అది తనకు బలంగా గుచ్చుకుందని అన్నారు. ఆ గాయం చాలా తీవ్రంగా అవ్వడంతో వెంటనే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, పరిస్థితి విషమించడంతో వైద్యులు తనకు ఏకంగా రెండుసార్లు సర్జరీలు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఆ గాయం తగ్గేందుకు ఏకంగా 48 కుట్లు వేశారని అఖిల్ చెప్పుకొచ్చారు. ఈ సర్జరీల తర్వాత పూర్తిగా కోలుకుని, మళ్లీ పాత స్థితికి రావడానికి తనకు ఏకంగా 16 నెలల సుదీర్ఘ సమయం పట్టిందని అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడం ఒకవైపు బాధను కలిగిస్తే.. ఈ ప్రమాదం తనను శారీరకంగా మరింత దెబ్బతీసిందని అన్నారు. అందుకే తాను చాలా కాలం పాటు సినిమాలకు, షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు.






