టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటి పట్టాలు

by Vemula.Srinu Prasad |

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ఇంటి పట్టాలను బహుమతిగా అందజేశారు....

టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటి పట్టాలు
X

దిశ, శ్రీకాళహస్తి: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ఇంటి పట్టాలను బహుమతిగా అందజేశారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన జస్మిత, సాయి పూజిత, మోహిత్, చరణ్, సాయి పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. దీంతో వారిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

అంతేకాకుండా వారితో కలిసి అల్పాహారం సేవించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇంటి పట్టాలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇంటి పట్టాలను అందజేశారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఒక్కో విద్యార్థికి మూడు సెంట్లు స్థలాన్ని పట్టాగా అందజేశారు. అంతేకాకుండా మంత్రి లోకేష్ విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయి వివరాలు అడిగి తెలుసుకున్నారు..

Next Story