- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల అభివృద్ధే నా లక్ష్యం : ఎమ్మెల్యే
గ్రామాల సమగ్ర అభివృద్ధే నా లక్ష్యమని, "ప్రతి గ్రామం మెరవాలి.. ప్రజలు మురవాలని, అందుకు అవసరమైన నిధుల మంజూరు బాధ్యత నాదే" అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.

దిశ, ఇబ్రహీంపట్నం : గ్రామాల సమగ్ర అభివృద్ధే నా లక్ష్యమని, "ప్రతి గ్రామం మెరవాలి.. ప్రజలు మురవాలని, అందుకు అవసరమైన నిధుల మంజూరు బాధ్యత నాదే" అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు ఎమ్మెల్యేను తొర్రూర్ క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామసమస్యలను వినిపించారు. గత రెండున్నరేళ్లలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యల పై గ్రామ ప్రతినిధులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
ఇప్పటికే మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఎమ్మెల్యే ఆరా తీసి, అవసరమైన చోట మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమస్యల రహితంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. తులేకలాన్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తులేకాలన్ గ్రామ సర్పంచ్ సామ అశ్విని రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






