- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ ఢీకొని రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ మృతి..
ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

దిశ, పెన్‌పహాడ్: ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్టుమాస్టర్ కన్మంతరెడ్డి కృపాకర్ రెడ్డి (70) వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వెన్న గోపి రెడ్డి (పాల) ఇటీవల కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను డ్రైవర్ ఇంద్రపెళ్లి రాంబాబు నడుపుతుండగా ఎదురుగా వస్తున్న కృపాకర్ రెడ్డి సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృపాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య కన్మంతరెడ్డి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గోపీకృష్ణ తెలిపారు.






