డిజిటల్ చెల్లింపుల్లో OTPలకు చెల్లు.. సరికొత్తగా ‘పేమెంట్ పాస్‌కీ’ లాంచ్ చేసిన VISA

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-02 14:34:34  IST  )

ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు వీసా (Visa) సరికొత్త 'పేమెంట్ పాస్‌కీ'ని దేశంలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిజిటల్ చెల్లింపుల్లో OTPలకు చెల్లు.. సరికొత్తగా ‘పేమెంట్ పాస్‌కీ’ లాంచ్ చేసిన VISA
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరగడం, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడుతన్న తరుణంలో ఆన్‌లైన్ చెల్లింపుల భద్రత కోసం ఇకపై వన్-టైమ్ పాస్‌వర్డ్‌ల (OTPs) కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అవసరమని గ్లోబల్ పేమెంట్స్ దిగ్గజం వీసా(Visa) స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే దేశంలో సరికొత్త ‘వీసా పేమెంట్ పాస్‌కీ’ (Visa Payment Passkey - VPP) సొల్యూషన్‌ను లాంచ్ చేసింది. అయితే, వినియోగదారులు ఆన్‌లైన్ కార్డ్ పేమెంట్లు చేసేటప్పుడు ఇకపై ఓటీపీల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఫోన్లలో ఉండే ఫింగర్‌ ప్రింట్, ఫేస్ లాక్, డివైజ్ పిన్/ప్యాటర్న్ ద్వారా లావాదేవీలను సేఫ్‌గా పూర్తి చేయవచ్చు..

ఫిషింగ్ మోసాలకు చెక్..

హ్యాకర్లు ఓటీపీలను దొంగిలించి చేసే ‘ఓటీపీ ఫిషింగ్’ మోసాలకు ‘వీసా పేమెంట్ పాస్‌ కీ’ టెక్నాలజీ అడ్డుకట్ట వేయనుంది. ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన FIDO ప్రమాణాలపై ఆధారపడి రూపొందింది. ఇది భారతదేశంలో అమలులో ఉన్న టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) నిబంధనలకు కూడా లోబడి ఉంటుంది. ఆన్‌లైన్ కార్డ్ పేమెంట్స్ టోకనైజేషన్‌లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని వీసా ఇండియా ప్రతినిధి సురేష్ సేథి పేర్కొన్నారు.

Next Story