బెంగళూరు క్వారీ ప్రమాదంపై సీఎం డీకే శివకుమార్ ఫైర్.. అధికారులకు కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

బెంగళూరు క్వారీ ప్రమాదంపై సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ లేని క్వారీలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

బెంగళూరు క్వారీ ప్రమాదంపై సీఎం డీకే శివకుమార్ ఫైర్.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు క్వారీ ప్రమాదంపై సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ లేని క్వారీలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. కాగా ఈ ప్రమాదం బెంగళూరు శివారు ప్రాంతంలోని కావేరీ క్వారీలో చోటు చేసుకుంది. కార్మికులు పనిచేస్తున్న సమయంలో పై భాగంలో ఉన్న బండరాయి విరిగి కిందపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు.

గాయప‌డిన మ‌రో ఆరుగురికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మృతులు బిహార్ కు చెందిన‌వారిగా తెలుస్తోంది. ప్ర‌మాదం జరిగిన వెంట‌నే పోలీసులు, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ బృందాలు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. శిథిలాల కింద మ‌రికొంద‌రు ఉండ‌టంతో భారీ యంత్రాల‌తో స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే క్వారీ ప‌రిసరాలను మూసివేసి ఎవరినీ లోప‌ల‌కు అనుమ‌తించ‌కుండా అడ్డుకుంటున్నారు.

Next Story