ఏపీకి ఒట్టి చేతులతో రాలేదు.. తీపికబురుతో వచ్చా: శివరాజ్ సింగ్ చౌహాన్

by Vemula.Srinu Prasad |

మామిడి రైతులకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీపి కబురు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు...

ఏపీకి ఒట్టి చేతులతో రాలేదు.. తీపికబురుతో వచ్చా: శివరాజ్ సింగ్ చౌహాన్
X

దిశ, వెబ్ డెస్క్: మామిడి రైతుల(Mango Farmers)కు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan) తీపి కబురు అందించారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పర్యటనలో భాగంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీ(Ap)కి ఒట్టి చేతులతో రాలేదని, మేనమామగా ఇక్కడి రైతులకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

భారీ ఎత్తున మామిడి సేకరణ

మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ఏపీలో భారీ ఎత్తున మామిడి సేకరించనున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా దాదాపు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి రకం మామిడి కాయలను సేకరించే ప్రతిపాదనతో తాము ముందుకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ధరల పతనంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రైతుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. తోతాపురి మామిడి సేకరణ ద్వారా రైతులకు మద్దతు ధర లభించడమే కాకుండా, మార్కెట్‌లో ధరల స్థిరీకరణకు ఈ నిర్ణయం దోహదపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

Next Story