- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టేకులపల్లి నూతన ఎస్సైగా కె.తిరుపతి బాధ్యతల స్వీకరణ..
టేకులపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా కె. తిరుపతి బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

దిశ,టేకులపల్లి: టేకులపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా కె. తిరుపతి బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు టేకులపల్లి ఎస్సైగా విధులు నిర్వహించిన రాజేందర్ వి. ఆర్ భద్రాద్రి కొత్తగూడెం కు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో తిరుపతి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై తిరుపతి పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై తిరుపతి కి స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఎస్సై ని సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






