- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టాల్లోనూ వీడని బంధం.. భర్తకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తున్న వృద్ధురాలు వైరల్
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. కష్టాలొస్తే బంధాలను సులువుగా వదిలేసుకునే ఈ రోజుల్లో.. కడదాకా తోడుంటానని చేతల్లో నిరూపిస్తోందో వృద్ధురాలు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. కష్టాలొస్తే బంధాలను సులువుగా వదిలేసుకునే ఈ రోజుల్లో.. కడదాకా తోడుంటానని చేతల్లో నిరూపిస్తోందో వృద్ధురాలు. వీధిన పడిన పరిస్థితుల్లోనూ, పక్షవాతంతో బాధపడుతున్న తన భర్తకు ఆమె ఎంతో ఆప్యాయంగా అన్నం తినిపిస్తున్న దృశ్యం అందరి కంటతడి పెట్టిస్తోంది.
తల్లి ప్రేమను తలపిస్తూ..
ఓ తల్లి తన బిడ్డకు ఎలాగైతే గోరుముద్దలు తినిపిస్తుందో, అదే ప్రేమతో ఆ వృద్ధురాలు భర్తకు అన్నం పెడుతోంది. ఆయన ‘ఇక చాలు’ అంటున్నా వినకుండా, బతిమాలి మరీ ముద్దలు కలిపి తినిపించడం వారి మధ్య ఉన్న అపారమైన ప్రేమానురాగాలకు అద్దం పడుతోంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తుండగా, కచ్చితమైన ప్రాంతం ఇంకా తెలియరాలేదు.
నేటి తరానికి ఆదర్శం
సుఖాల్లో మాత్రమే కలిసి ఉండి, చిన్న చిన్న మనస్పర్ధలకే విడిపోతున్న నేటి తరం యువతకు ఈ వృద్ధ దంపతులు గొప్ప ఆదర్శమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా తోడు వీడని ఆ వృద్ధురాలి ప్రేమ, ఆత్మీయత నిజమైన బంధానికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ భావోద్వేగాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.






