- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతి జరిగింది కాబట్టే మమ్మల్ని చర్చకు వెళ్లకుండా అడ్డుకున్నారు: హరీష్ రావు
జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని హరీష్ రావు అన్నారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది అన్నాడు, ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేసిందని అంటున్నారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని హరీష్ రావు అన్నారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది అన్నాడు, ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేసిందని అంటున్నారని చెప్పారు. నిన్నటికి ఈరోజుకే లక్ష తగ్గిందా అని ప్రశ్నించారు. ఇవాళ చర్చ జరిగి ఉంటే రెండు లక్షలకో మూడు లక్షలకో ఒప్పుకునేవారని అన్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే, జూపల్లి కృష్ణారావు నేను తెలంగాణ భవన్‌కు వస్తానని, ఈరోజు సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్ళిపోయాడని ఎద్దేవా చేశారు.
గురుకుల టెండర్లలో అవినీతి జరిగింది కాబట్టే తమను చర్చకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేయించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తారంటే హరీష్ రావు రావాలి, గన్ పార్క్ వద్దకు రావాలన్నారు.. సరే అని నేను వెళ్తుంటే అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో బంధించారని చెప్పారు. అక్కడ కూడా కుర్చీ వేసి మంత్రులను చర్చకు రమ్మని ఆహ్వానించానన్నారు. చర్చలు జరిగితే బండారం అంతా బయటపడుతుందని భయంతో, చర్చలు జరగకుండా తమను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






