విశాఖలో వరుస ప్రమాదాలు.. నలుగురు మృతి

by Vemula.Srinu Prasad |

విశాఖ జిల్లా గాజువాకలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని భయాందోళనలను కలిగిస్తున్నాయి...

విశాఖలో వరుస ప్రమాదాలు.. నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా(Visakha) గాజువాక(Gajuwaka)లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు(Road Accidents) తీవ్ర విషాదాన్ని(Tragedy), భయాందోళనలను కలిగిస్తున్నాయి. కేవలం ఒక్క రోజులోనే రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే కారణాలుగా తెలిశాయి.

శ్రీనగర్ ఫ్లైఓవర్‌పై...

మొదటి ఘటనలో బుధవారం శ్రీనగర్ ఫ్లైఓవర్‌పై బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అన్నదమ్ములు రమేష్, సతీష్ స్పాట్‌లోనే మృతి చెందారు. గురువారం గాజువాక ప్రాంతంలోనే మరో ప్రమాదం జరిగింది. అగనంపూడి టోల్‌గేట్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. కుసుమ, మంగ అనే ఇద్దరు మహిళలు సైతం స్పాట్‌లోనే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఏడేళ్ల చిన్నారి తన్వి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాసేపట్లో ఇళ్లకు చేరుకుంటారనే నేపథ్యంలో..

ఈ రెండు ప్రమాదాల్లోనూ బాధితులు మరికొద్ది సేపట్లో తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలోనే మృత్యువు వారిని కబళించింది. దీంతో స్థానికులను కలచివేసింది. గాజువాక పరిసర ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలతో వాహనదారులు, స్థానిక నివాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను తక్షణమే కఠినతరం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story