తెలంగాణ కేబినెట్ భేటీ షురూ.. డుమ్మా కొట్టిన మంత్రి కొండా సురేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-02 11:32:40  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి పేపర్‌లెస్ కేబినెట్ భేటీ ప్రారంభమైంది.

తెలంగాణ కేబినెట్ భేటీ షురూ.. డుమ్మా కొట్టిన మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సెక్రటేరియట్‌లో తొలి పేపర్‌లెస్ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు కే.రామకృష్ణా రావు, తదితరులు పాల్గొన్నారు.

అయితే, ఈ సమావేశానికి అనూహ్యంగా దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాత్రం డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మీటింగ్‌కు హాజరు కాలేదని ఆమె కార్యాలయం నుంచి సీఎంవోకు మెసేజ్ అందినట్లుగా సమాచారం. మరోవైపు ఇటీవల యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు పాలకమండలి సభ్యుల కూర్పును దేవాదాయ శాఖ మంత్రి అయిన తనకు తెలియకుండా చేశారని, అందుకే ఇవాళ కొండా సురేఖ మంత్రివర్గ భేటీలో పాల్గొనలేదని బయట ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏది ఏమైనా తొలి పేపర్‌లెస్ కేబినెట్ భేటీకి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story