- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో ఏడు ఆవులు మృతి
ములుగు మండలంలోని సర్వాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఏడు విలువైన ఆవులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు మండలంలోని సర్వాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఏడు విలువైన ఆవులు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పశువుల యజమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి సమ్మిటేజ్‌కు చెందిన మూడు ఆవులు, జాజరామయ్యకు చెందిన రెండు ఆవులు, భుఖ్య లచ్చులు, నర్సింగారావుకు చెందిన ఒక్కో ఆవు ఉదయం తమ ఇళ్ల నుంచి మేత కోసం పొలాల వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్టు వైర్‌కు విద్యుత్ ప్రవహించడంతో మొత్తం ఏడు ఆవులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. మృతిచెందిన ఆవుల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు ఎర్తింగ్ సమస్యల కారణంగా ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల వల్ల పశువులతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటూ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, సపోర్టు వైర్లు, ఎర్తింగ్ సమస్యలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.






