- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య బదిలీ
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఆమెను ఆ బాధ్యతల నుంచి బదిలీ చేసి, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమించారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక స్థానచలనం జరిగినట్లు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఆమె త్వరలోనే హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అన్యాయంగా నా భార్యను బదిలీ చేశారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్






