- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్యాయంగా నా భార్యను బదిలీ చేశారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్
తన భార్య లక్ష్మీబాయి బదిలీపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్ ముఖ్యనేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar)కు దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పటికే ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు కారు సౌకర్యాన్ని తొలగించిన ప్రభుత్వం తాజాగా ఆయన సతీమణి లక్ష్మీబాయి (Lakshmi Bai) కూడా బదిలీ చేసింది. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్‌గా విధుల్లో ఉన్న ఆమెను, ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ కోపరేటివ్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, తన సతీమణికి జరిగిన బదిలీపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ బదిలీలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కానీ, తాము అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు. పొలిటికల్‌గా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అందులో భాగంగానే తొలుత తన భద్రతను తగ్గించారని కామెంట్ చేశారు. ఆ అంశంపై తాను హైకోర్టు (High Court)ను ఆశ్రయించడంతో అక్కడ పాక్షిక ఉపశమనం లభించిందన్నారు. తనకు రిలీఫ్ దక్కడంతో అదే జీర్ణించుకోలేకనే ఈ కుఠిల ప్రభుత్వం.. ఇప్పుడు తన సతీమణిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆమెకు అసలే సంబంధం లేని ఇతర విభాగానికి బదిలీ చేశారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు, కక్షసాధింపు చర్యలకు తాము భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య బదిలీ






