- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి... రూ.20 వేలకే కక్కుర్తి బుద్ధి
ఏలూరు జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహశీల్దార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు....

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జంగారెడ్డిగూడెం(Eluru Jangareddygudem)లో ఏసీబీ దాడులు(Acb Raids) కలకలం సృష్టించాయి. లంచం(Bribe) డిమాండ్ చేసిన డిప్యూటీ తహశీల్దార్(Deputy Tahsildar)ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ పని నిమిత్తం వచ్చిన వ్యక్తి నుంచి వెంకటేశ్వర్లు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇచ్చుకోలేని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంపై దాడి చేశారు. రూ. 20 లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శాఖా పరమైన చర్యలకు ఆదేశించారు. అయితే లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులెవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగే వెంటనే తమకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.






