‘NEET’ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కౌన్సెలింగ్ కంప్లీట్ గైడ్‌లైన్స్ విడుదల

by Kema Shiva Kumar |

నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) కంప్లీట్ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.

‘NEET’ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. కౌన్సెలింగ్ కంప్లీట్ గైడ్‌లైన్స్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ (NEET UG) రీ-ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసిన తర్వాత, వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. అయితే, కౌన్సిలింగ్ ప్రక్రియ నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నారు. మొదటి దశలో భాగంగా అర్హత సాధించిన విద్యార్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో రిజిస్టర్ చేసుకుని, నాన్-రిఫండబుల్ కౌన్సిలింగ్ ఫీజుతో పాటు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. రెండో దశలో విద్యార్థులు తమకు నచ్చిన మెడికల్ కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలి. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల సీటు దక్కే అవకాశాలు పెరుగుతాయి.

ఇక మూడో దశలో సలెక్ట్ చేసుకున్న కాలేజీల జాబితాను గడువు ముగిసేలోపు లాక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లాక్ చేయడం మర్చిపోతే, గడువు ముగిశాక సిస్టమ్ ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. ఒకవేళ లాక్ చేసిన తర్వాత ఆప్షన్లను మళ్లీ మార్చడం కుదరదు. నాలుగో దశలో భాగంగా అభ్యర్థి ఆలిండియా ర్యాంక్ (AIR), రిజర్వేషన్ కేటగిరీ, కాలేజీల్లో సీట్ల లభ్యత, క్యాండిడేట్ ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా కంప్యూటర్ అల్గారిథమ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు. ఐదో దశలో సీటు పొందిన విద్యార్థులు అలాట్‌మెంట్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆ అలాట్‌మెంట్ లెటర్‌ను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని, తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా నిర్దేశిత గడువులోగా కేటాయించిన కాలేజీకి వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

Next Story