- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలపై అత్యాచారం.. తల్లిదండ్రులు ఎలా గుర్తించొచ్చు?
మేడమ్.. నాకు ఆరేళ్ల పాప ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లల మీద లైంగిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కానీ భయంతో పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేకపోవచ్చు. ఒకవేళ పిల్లలపైన లైంగిక అత్యాచారం లేదా వేధింపులు జరిగితే ఎలా గుర్తించాలి?

దిశ, ఫీచర్స్ : మేడమ్.. నాకు ఆరేళ్ల పాప ఉంది. ఈ మధ్యకాలంలో పిల్లల మీద లైంగిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కానీ భయంతో పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేకపోవచ్చు. ఒకవేళ పిల్లలపైన లైంగిక అత్యాచారం లేదా వేధింపులు జరిగితే ఎలా గుర్తించాలి? - సహజ, నల్లగొండ
జవాబు: మీరు మంచి, బాధ్యతాయుతమైన ప్రశ్న వేశారు. అందుకు అభినందిస్తున్నాను. ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఇది. పిల్లల(3-15ఏళ్ల వయసు)పై లైంగిక అత్యాచారం జరిగినట్లయితే.. మూడు రకాల లక్షణాలు కనిపిస్తాయి.
1) మానసిక లక్షణాలు - డిప్రెషన్, ఆందోళన, భయం, కోపం, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణి, ఉండుండి ఏడవడం, తప్పు చేసినట్లు గిల్టీగా ఫీలవడం, ఒంటరితనాన్ని కోరుకోవడం, మతిమరుపు, ఏకాగ్రత కోల్పోవడం, చదువుపట్ల ఆసక్తి పోవడం, మగవారిని చూసి పానిక్ అయిపోవడం, ద్వేషం పెంచుకోవడం, ఇంట్లో నుంచి లేదా హాస్టల్, స్కూల్ నుంచి పారిపోవడం, నిద్రలో మూత్ర విసర్జన చేయడం, చీకటిని చూసి భయపడటం, అన్నం మానేయడం.
2) మనోశారీరక లక్షణాలు- తలనొప్పి, జీర్ణ సంబంధ వ్యాధులు, ఒళ్లు నొప్పులు, ఆకలి లేకపోవడం, ఎసిడిటీ, కడుపులో నొప్పి, నిద్రలో పీడకలలతో లేవడం, ఒంటరిగా పడుకోడానికి భయపడటం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (ptsd) అంటే తీవ్రమైన సంఘటన జరిగాక కలిగే మానసిక ఒత్తిడి, విభ్రాంతికి లోనవడం, అవసరానికి మించి స్పందించడం, రౌద్రంగా మారిపోవడం.
3) శారీరక లక్షణాలు - పిల్లల శరీరంపై గోళ్ల/కొరికిన రక్కులు, ముఖ్యంగా రజస్వల కానీ పిల్లల్లో లో దుస్తులపై రక్తం/ వీర్యం మరకలు కనిపించడం, పాయు మార్గంలో, జననాంగాల చుట్టూ వాపు, ఎరుపు, మంట, నొప్పి, గాయాలు కనిపించడం. పిల్లలు నొప్పి మూలంగా కాళ్లు వెడల్పు చేసి కష్టంగా నడుస్తుంటారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన మూత్రంలో మంట అని ఏడుస్తుంటారు. స్నానం చేయించేటప్పుడు కూడా ఏడుస్తుంటారు. బాలురలో కూడా పురుషాంగం వాచి నొప్పి, మంటతో ఏడుస్తారు. అనవసర ద్రవాలతో ఇబ్బంది పడతారు. సుఖ వ్యాధుల లక్షణాలు... జననంగాల్లో వాపు, దురద, పుండ్లు ఏర్పడుతాయి. బాలికల్లో అయితే పై లక్షణాలతోపాటు గజ్జల్లో లింపు గ్రంధుల వాపు, నొప్పి, జ్వరం ఉంటాయి. రజస్వల అయిన ఆడపిల్లల్లో భయంతో హార్మోన్ల అపసవ్యత వలన పీరియడ్స్ ఆలస్యంగా రావడం లేదా రాకపోవడం, గర్భం దాల్చడం జరుగుతుంది. చిన్న పిల్లలు తల్లిదండ్రులను తమను ముట్టుకొనివ్వరు. వారి ముందు నగ్నంగా నిలబడరు. స్నానం కూడా చేయించనివ్వరు.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
* నేరస్థుడు లేక పీడోఫీలిక్ అంటే చిన్న పిల్లలమీద లైంగిక అత్యాచారాలు చేసేవాళ్లని పీడోఫీలిక్ అంటారు. అమ్మ నాన్నలకు కూడా ఏదైనా హాని చేస్తాడేమో అని.. అలాగే తల్లిదండ్రులు తమని అర్థం చేసుకోక తమదే తప్పు అని శిక్షిస్తారేమో అని పిల్లలు భయంతో చెప్పరు. కుటుంబ గౌరవం పోతుందని.. అవమానం, హేళనలకి గురి కావాల్సి వస్తుందని.. అందరికీ తెలిస్తే పెద్దయ్యాక పిల్ల పెళ్లి కాదేమో అని భయాలతో తల్లిదండ్రులు దాచిపెడుతారు. కంప్లైంట్ ఇవ్వరు. కానీ ఎక్కడో ఒకచోట ప్రతిరోజు వందల మంది చిన్నారులపై పేడోఫీలిక్‌లు అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. అందుకే పిల్లల్లో ఈ లక్షణాలు బయట పడిన వెంటనే తల్లిదండ్రులు పానిక్ కాకుండా.. డిప్రెషన్‌లోకి వెళ్లకుండా.. తదుపరి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పిల్లలకు మరింత ప్రేమను, ధైర్యాన్ని, శ్రద్దను ఇవ్వాలి. వాళ్లలో గిల్టీ ఫీలింగ్ పోగొట్టాలి. చైల్డ్ కౌన్సెలెర్‌ల దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించాలి. శారీరక బాధలకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. పిల్లలు ఎవరి దగ్గరికైనా వెళ్లం అంటే అసలు పంపొద్దు. ఎందుకంటే తెలిసిన వాళ్లే.. కుటుంబ సభ్యులు బాబాయిలు, మాములు, అన్నలు, తండ్రులు, స్కూల్ ఆటోడ్రైవర్లు, ట్యూషన్ మాస్టర్లు, పక్కింటి అబ్బాయిలు వీళ్లు మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తారు.






