మహిళ ఫిర్యాదు.. వైద్యుడిపై అట్రాసిటీ కేసు నమోదు

by Taduka Kalyani |

ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్‌లో పట్టణానికి చెందిన వైద్యుడు డాక్టర్ రాహుల్ పుష్కర్,

మహిళ ఫిర్యాదు.. వైద్యుడిపై అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్‌లో పట్టణానికి చెందిన వైద్యుడు డాక్టర్ రాహుల్ పుష్కర్, ఆయన భార్య విజయలక్ష్మి తో పాటు పలువురిపై కేసు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం.. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత మూడు సంవత్సరాలుగా డాక్టర్ రాహుల్ పుష్కర్ ఇంట్లో గృహ సహాయకురాలిగా పనిచేస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, కుల దూషణలు చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 5న రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట తనను అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మావల పోలీసులు బీఎన్‌ఎస్‌, ఎస్సీ, ఎస్టీ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story