బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని 16వ వార్డు బోయపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యాంసుందర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, శేఖర్ గౌడ్, మధుసూదన్ గౌడ్, పురుషోత్తంరావుతో పాటు సుమారు 150 మంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని అన్నారు. దీంతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్థానికంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మద్దతును మరింత పెంచుతున్నాయని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేష్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, రాములు యాదవ్, మైత్రి యాదయ్య, మున్నూరు రవి, అజ్మత్ అలీ, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story