జడ్పీహెచ్‌ఎస్ బోడు పాఠశాలలో డీఈవో తనిఖీ

by Taduka Kalyani |

జడ్పీహెచ్‌ఎస్ బోడు పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ( డీఈవో ) వాసంతి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ( ఆర్ జె డి ) మదన్ మోహన్ సందర్శించి పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

జడ్పీహెచ్‌ఎస్ బోడు పాఠశాలలో డీఈవో తనిఖీ
X

దిశ,టేకులపల్లి: జడ్పీహెచ్‌ఎస్ బోడు పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ( డీఈవో ) వాసంతి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ( ఆర్ జె డి ) మదన్ మోహన్ సందర్శించి పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డీఈఓ శ్రీమతి వాసంతి తరగతి గదులను సందర్శించి, ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. బోధనను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులకు విలువైన సూచనలు అందించారు. అలాగే విద్యార్థులకు కూడా చదువులో మరింత పురోగతి సాధించేలా పలు సూచనలు చేశారు.ఆర్జేడీ మదన్ మోహన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అభివృద్ధి చెందనున్న జడ్పీహెచ్‌ఎస్ బోడు పాఠశాలను సందర్శించి, పాఠశాలలోని భౌతిక వసతులు, మౌలిక సదుపాయాలు,అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన అంశాలపై ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ బోడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అజ్మీర జగన్ పాల్గొని, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన విషయాలు గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బోడు గ్రామానికి చెందిన ప్రముఖులు శేకర్ , వీరభద్రం, రవి, శ్రీనివాస్, సైదులు, బాలాజీ తదితరులు పాల్గొని, పాఠశాల అభివృద్ధి, గ్రామ సహకారం, అందుబాటులో ఉన్న వనరుల గురించి తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్శన ద్వారా పాఠశాల అభివృద్ధికి అవసరమైన పలు అంశాలపై చర్చ జరిగి, భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా పాఠశాల మరింత అభివృద్ధి చెందేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.

Next Story