- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నేత నరేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
సీఐడీ డీఎస్పీ ఎస్.భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన సన్నిహితుడిగా భావిస్తున్న మణికొండ పూర్వపు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గురువారం తనిఖీలు చేశారు.

దిశ, గండిపేట : సీఐడీ డీఎస్పీ ఎస్.భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన సన్నిహితుడిగా భావిస్తున్న మణికొండ పూర్వపు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గురువారం తనిఖీలు చేశారు. డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసం ఉంటున్న గోల్కొండ సర్కిల్ పరిధిలోని తారామతి బారాదరి ఎదురుగా ఉన్న వెసెల్లా మీడోస్ లో కూడా తనిఖీలు చేసి భారీగా ఆస్తి పత్రాలు బంగారం గుర్తించారు. మణికొండ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న నరేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా కొంత నగదును గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమ్ రెడ్డి, నరేందర్ రెడ్డికి గల సంబంధాల పై అధికారులు దృష్టి సారించారు. ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు జరగడం గండిపేట మండలంలో తీవ్రచర్చనీయాంశంగా మారింది. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఆయన ఇంటి వద్దకు అధికారులు మీడియాను అనుమతించలేదు. ఏసీబీ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






